రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. అయితే 5.2 ఓవర్ల ఆట తర్వాత రోహిత్ రిటైర్డ్ హార్ట్‌గా క్రీజు వదిలి వెళ్లిపోయాడు. పవర్ ప్లే ముగిసేసరికి ముంబయి స్కోరు వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది.