TG: హైదరాబాద్‌లోని బేగంపేట యాక్సిస్ బ్యాంక్‌లో భారీ మోసం జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో బ్యాంక్ మేనేజర్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. వినియోగదారుడి ఖాతా నుంచి రూ.6.5 కోట్లు కొట్టేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాను విదేశాల్లో ఉన్న సమయంలో కుట్ర చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతకం ఫోర్జరీ చేసి లూజ్ లీఫ్ చెక్కులు వినియోగించారని తెలిపారు.