AP: రాష్ట్రంలో ఇవాళ భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణశాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం తదితర జిల్లాల్లో 42°C-44°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.