SKLM: కొల్లూరు రాణా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెకానికల్ ఇంజినీర్ జనార్దనరావు (45) మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై విధులకు వెళ్తుండగా రాజపుష్ప రోటరీ వద్ద టిప్పర్ ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.