కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’ ప్రపంచవ్యాప్తంగా రూ.7,100 కోట్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. థియేటర్లలో అదరగొట్టిన ఈ చిత్రం జూన్ 9 నుంచి బుక్‌మైషో స్ట్రీమ్‌లో డిజిటల్ ప్రీమియర్‌గా రానుంది. ఇంగ్లీష్, హిందీలో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంటుంది. అదే రోజు అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీల్లోనూ రెంటల్ బేసిస్‌పై విడుదలయ్యే అవకాశం ఉంది.