SRPT: పట్టణంలో గంజాయి నిర్మూలన లక్ష్యంగా నార్కోటిక్ డాగ్ ‘రోలెక్స్’తో పోలీసులు బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది హోటళ్లు, టీ దుకాణాలు, మెడికల్ షాపులు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో సోదాలు చేపట్టినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించారు.