నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ కొండాయపాలెం గేట్ కూడలిలోని అంబేద్కర్ భవన్ పునః ప్రారంభం కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి బుధవారం పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో ఆధునిక వసతులతో నవీనీకరించిన అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.