ATP: నగరపాలక సంస్థ పరిధిలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) కింద 15 రోజుల్లోగా పనులు ప్రారంభం కావాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నిబంధనల మేరకు డిజైన్లు పూర్తి చేసి, వచ్చే ఆగస్టు 15 నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.