ప్రకాశం: కనిగిరి పట్టణ సమీపంలోని బుధవారం కారు ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో దిచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మస్తాన్ అనే వ్యక్తి మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని మొదట స్థానిక ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.