AP: వైసీపీ నేతల విమర్శలకు మంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. DSCపై సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వైసీపీ నేతలకు సమస్యనే కావాలని సమాధానం కాదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నేతలు.. బురదజల్లే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం దుకాణాల ముందు టీచర్లను నిలబెట్టి ఘనత వారిదని ధ్వజమెత్తారు. టీచర్ ఉద్యోగం వచ్చిన వాళ్లను మద్యం దుకాణం వద్ద నిలబెట్ట లేదా అని నిలదీశారు.