MLG: వెంకటాపూర్ మండలంలోని జవహర్ నగర్ ప్రభుత్వ మోడల్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ మందపల్లి కృష్ణ మంగళవారం తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రిజర్వేషన్, మెరిట్ ప్రాతిపదికన అడ్మిషన్లు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.