PDPL: రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన BRS పార్టీ నాయకుడు, ప్రముఖ కాంట్రాక్టర్ గోపు ఐలయ్య యాదవ్ ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు. వ్యాపార నిమిత్తం 2 రోజుల క్రితం కోల్కతాకు వెళ్లిన ఆయన అక్కడే మృతి చెందాడు. విషయం తెలవడంతో పార్టీ శ్రేణులతో పాటు కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈరోజు సాయంత్రం పార్థివ దేహాన్ని స్వస్థలానికి తీసుకురానున్నారు.