KMM: మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలంగాణ తొలి సీఎం చంద్రశేఖర రావు అడుగుజాడల్లో ముందుకు సాగుతూ పార్టీని మరింత శక్తివంతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఖమ్మంలోని తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులు వేడుకలు వేడుకల్లో ఎంపీ పాల్గొని మాట్లాడారు.