మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)లో ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదినం పురస్కరించుకొని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోగులకు పండ్లను పంపిణీ చేశారు. హరీష్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.