శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో బుధవారం దేవిస్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థుల జెర్సీ లోగోను టీడీపీ మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ ఆవిష్కరించారు. కర్రసాము యువతలో క్రమశిక్షణ, ధైర్యం పెంచుతుందని, సంప్రదాయ కళలను కాపాడాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బలగ శివ ప్రసాద్, కోచ్ హర్షవర్ధన్, శాశపు జోగినాయుడు, తదితరులు పాల్గొన్నారు.