PLD: లింగంగుంట్లలో సాగవుతున్న ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించేందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల బృందం బుధవారం పర్యటించింది. ప్రాజెక్ట్ మేనేజర్ అమల కుమారి ఆధ్వర్యంలో స్థానిక రైతుల పొలాలను సందర్శించిన విదేశీ బృందం, ఇక్కడి సేంద్రియ పద్ధతులను అడిగి తెలుసుకుంది. తక్కువ పెట్టుబడితో కూడిన ఈ వ్యవసాయ విధానం పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనారు.