BDK: చర్ల మండలం లో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు పాల్గొని లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతాయని తెలిపారు. అనంతరం స్థానిక గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలియజేస్తూ,ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు.