BDK: పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగిరెడ్డి భువన సుందర్ రెడ్డి ఇటీవల ఎన్నికయ్యారు. కాగా బుధవారం హైదరాబాద్ సెక్రటేట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యకర్తలను అందరినీ కలుపుకొని మంచిగా పని చేయాలని మంత్రి వారికి సూచించారు. గ్రామస్థాయి కార్యకర్తలు అందరిని కలుపుకోవాలని అన్నారు.