PDPL: పట్టణ ప్రగతి ప్రణాళికల్లో భాగంగా బుధవారం రామగుండం నగరంలోని 26, 27, 28 డివిజన్లలో పర్యటించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజలను కలిశారు. వారి కాలనీల్లోని రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం తదితర సమస్యలపై స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.