SS: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ సహాయం, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వంటి పలు అంశాలపై వినతులు అందినట్లు మంత్రి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రతి అర్జీపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత తెలిపారు.