AKP: మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి స్మార్ట్ కిచెన్లను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము డిమాండ్ చేశారు. బుధవారం అచ్యుతాపురంలో మధ్యాహ్నం భోజనం కార్మికులతో సమావేశం నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు. నిర్వాహకులను కార్మికులుగా గుర్తించాలన్నారు. నిత్యవసర సరుకుల పెంపుకు అనుగుణంగా బడ్జెట్ను పెంచాలన్నారు.