CTR: త్వరలో చేపట్టనున్న SIRపై జిల్లాలో ప్రధాన పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఈ కార్యక్రమం జరిగిన రాష్ట్రాలలో లక్షలాది ఓట్లు పోవడంతో ఆ పరిస్థితి తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. YCP ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించింది. TDP నేతలకు అమరావతిలో శిక్షణ ఇచ్చారు. SIR ద్వారా ఎవరికీ నష్టం చేకూరకుండా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.