NGKL: జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో బల్మూర్ మండలం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన మూడవత్ కిరణ్ కుమార్ జాతీయస్థాయి ఎస్టీ కేటగిరీలో 346వ ర్యాంకు సాధించాడు. మారుమూల గ్రామానికి చెందిన శాంతి, శ్రీను దంపతుల కుమారుడైన కిరణ్ కఠిన శ్రమతో చదివి ఈ విజయాన్ని సాధించాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.