పల్నాడు జిల్లా భూ సర్వే అధికారి CH. భాను కీర్తి పదోన్నతిపై బదిలీ అవుతున్న సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు. జిల్లాలో తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించిన ఆమె, కొత్త బాధ్యతల్లో కూడా విశేష విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి, ప్రజాసేవలో మరింత గుర్తింపు పొందాలని తెలిపారు.