AP: DY CM పవన్‌పై మాజీమంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మీటింగ్ పెట్టరు కానీ తెలంగాణలో పెడతారట అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకోని ఆయన.. తెలంగాణ వెళ్లి 6 గ్యారంటీలపై ప్రశ్నిస్తానని అనడం ఏంటని చురకలంటించారు. రాష్ట్రంలోని జనసేన నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారని.. అందుకే పవన్ సింపతీ పొందేందుకు యత్నిస్తున్నారని చెప్పారు.