AP: ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. సంపూర్ణ ఆరోగ్యం ఉన్న వారే నిజమైన ధనవంతులని పేర్కొన్నారు. వేల కోట్లు, పదవులు ఉన్నా.. ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదని చెప్పారు. సంజీవని పేరుతో రాష్ట్రంలో డిజిటల్ హెల్త్ రికార్డు ప్రాజెక్టును తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. పేదవాళ్ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.