AP కమ్యూనిటీ ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి (APCNF) 2026 ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ దక్కింది. స్వీడన్లో దీన్ని ప్రదానం చేశారు. అలాగే రూ.14 కోట్ల నగదును బహుమతి అందజేశారు. ప్రకృతి హితమైన వ్యవసాయాన్ని ఎలా అమలు చేయొచ్చో APCNF చేసి చూపిస్తోందని ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ జ్యూరీ ప్రొఫెసర్ లిండివే మజెలే తెలిపారు. ఈ విధానం ఏకకాలంలో రైతుల జీవనోపాధితోపాటు పర్యావరణాన్ని మెరుగుపరుస్తోందన్నారు.