BHPL: గోరి కొత్తపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో ట్రాక్టర్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర అవసరాలకు ఇసుక రవాణా నేపథ్యంలో జరిగిన ఈ సమావేశంలో తహసీల్దార్, ఎస్సై, ఎంపీడీవో పాల్గొన్నారు. ట్రాక్టర్ యజమానులు రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్‌లతో ఎమ్మార్వో కార్యాలయంలో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.