BDK: జూలూరుపాడు మండలం వినోబా నగర్ గ్రామంలో నిన్న రాత్రి వీచిన గాలి దుమారానికి భారీ చెట్టు నేలకూలడంతో లక్ష్మి అనే వృద్ధురాలి ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ సర్పంచ్ నవీన్ వెంటనే స్పందించి బాధితురాలి ఇంటిని ఇవాళ పరిశీలించారు. అలాగే తక్షణ ఆర్థిక సహాయాన్ని ఆమెకు అందజేశారు. భవిష్యత్తులో అండగా ఉంటామని హామీ ఇచ్చారు.