AP: వైసీపీ అధినేత జగన్ను డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతిని అభ్యర్థులు జగన్ను వివరించారు. టీడీపీ నేతలు స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకున్నట్లు ఆరోపించారు. ఈ సందర్భంగా కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు మాజీ సీఎంకు చెప్పారు. నిజమైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.