బాపట్ల పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ చంద్రమోహన్ తెలిపారు. బుధవారం ఉమారెడ్డి సరోజినీ కాలనీలో నిర్వహించిన శుభ్రత పనులను పరిశీలించారు. రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తను తొలగించి, మురుగు కాలువల్లోని అడ్డంకులను వెంటనే శుభ్రం చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.