NLG: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి గ్రామ, వార్డు సభలు ప్రారంభం కానున్నాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, పర్యావరణ వారోత్సవాల నేపథ్యంలో నిర్వహించే ఈ సభలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలాల వారీగా కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోగా, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నోడల్ అధికారిని నియమించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.