NZB: భీమ్గల్ మండలం చేంగల్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా నూతనంగా వినయ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. డిచ్పల్లి మండలం నుంచి బదిలీపై వచ్చిన వినయ్, చేంగల్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధుల్లో చేరారు. ఇప్పటి వరకు చేంగల్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహించిన ప్రదీప్, వేల్పూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వినయ్ బాధ్యతలు చేపట్టారు.