ATP: పామిడి మండలం పాళ్యం తండా వైసీపీ ఎంపీటీసీ నీలాబాయి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసీ సంతాపం వ్యక్తం చేశారు. పలువురు వైసీపీ నేతలు ఆమె స్వగృహానికి చేరుకొని నీలాబాయి భౌతికయానికి పూలమాలవేసి నివాళులర్పించారు.