SRCL: బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలోని రాజీవ్ చౌక్ వద్ద జాతీయ జెండాకు అవమానం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ఉదయం ఎగరవేసిన జాతీయ పతాకాన్ని సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కూడా అవనతం చేయకుండా రాత్రంతా అలాగే ఉంచారు. బుధవారం ఉదయం వరకు జెండా అలాగే ఎగురుతూ కనిపించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.