VZM: ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యువజనాధికారి శ్రీ ప్రేమ్ భారత్ కుమార్ బుధవారం జెండా ఊపి సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత శారీరక దృఢత్వం (ఫిట్నెస్) పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని తెలిపారు.