SKLM: వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడాలోని ఓ వైన్ షాప్లో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. దొంగలు షాప్ పైకప్పును పగులగొట్టి లోపలికి ప్రవేశించి మద్యం బాటిళ్లతో పాటు కొంత నగదును అపహరించారు. ఘటనపై ఎక్సైజ్ సీఐ మల్లికార్జునరావు వివరాలు వెల్లడించారు. షాప్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగల ఆచూకీ కోసం విచారణ కొనసాగుతోందన్నారు.