NLR: సంగం మండలం పెరమన గ్రామంలో బుధవారం వేకువ జామున అత్యంత వైభవంగా అగ్ని గుండ మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పండరి భజన వేసి గుండం తొక్కి గ్రామస్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు. చుట్టూ ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేశారు. స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.