RR: మియాపూర్ సర్కిల్లో అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించారు. పెద్దాకుడి చెరువు, పటేల్ చెరువుల వద్ద కొనసాగుతున్న పనులను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ పరిశీలించారు. జాతీయ రహదారి, కాలనీల్లోని నీటి నిల్వ ప్రాంతాలను తనిఖీ చేశారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి, నాణ్యమైన పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.