VSP: అల్లిపురం వెంకటేశ్వరమెట్టపై కొలవుదీరిన శ్రీ బల్లిగిరి వెంకటేశ్వరస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం ఉదయం సాంప్రదాయబద్దంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సిహెచ్. వంశీకృష్ణ శ్రీనివాస్ ముందుగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.