WNP: ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి చెందడంతో కేసు నమోదు చేశామని గ్రామీణ ఎస్సై హృషి కేశ్ తెలిపారు. కొత్తకోట మండలం నాంచారం పేట గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి (50)నాచహల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా శివారులోని ఊర చెరువు కాల్వ కట్టపై అదుపుతప్పి కిందపడ్డారన్నారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడని పేర్కొన్నారు.