హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,220 ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,200 పలుకుతోంది. అటు కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.