AP: తిరుపతి అలిపిరి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అలిపిరి వద్ద స్ట్రీట్‌ఫుడ్ స్టాల్స్ తొలగింపును వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన చేపట్టింది. వ్యాపారులతో కలిసి రోడ్డుపై బైఠాయించడంతో వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైసీపీ నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో భూమన అభినయ్‌తో పాటు పలువురు నాయకులను అధికారులు అరెస్ట్ చేశారు.