TG: హైదరాబాద్లోని సచివాలయం ఎదుట దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమ భూమి విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దంపతులు కృష్ణయ్య, సాయమ్మ సిద్ధిపేట జిల్లా కొండపోచమ్మపల్లికి చెందిన వారిగా గుర్తించారు. వారిని సైఫాబాద్ పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.