శ్రీకాకుళం మండలం చాపురం పంచాయతీ తిలక్ నగర్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని స్థానికులు అంటున్నారు. కాలువలలోని మురుగు నీరంతా ఒకచోటే నిల్వ ఉంటుందని వారు పేర్కొన్నారు. దీంతో దోమలు బెడద, దుర్వాసన అధికంగా వస్తుందని వాపోతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించాలని మురుగునీటిని తొలగించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.