BHNG: పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామ సమీపంలోని క్రషర్ మిల్లులో ఇవాళ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. క్వారీ వద్దకు వీల్ లోడర్ వాహనంపై డీజిల్ డ్రమ్ములు తరలిస్తుండగా వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వలస కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.