మహబూబ్ నగర్: జడ్చర్ల మండలం గంగాపురం గ్రామంలోని ప్రసిద్ధ లక్ష్మీ చెన్నకేశవ స్వామిని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు క్రాంతి కిరణ్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు శాలువాతో ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అంద చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.