TG: కాంగ్రెస్ సర్కార్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సంచలన వ్యాఖ్యలు చేశారు. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పిందని ఆరోపించారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని రేవంత్, భట్టి చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వ నినాదం రైజింగ్.. విధానం మాత్రం ఫాలింగ్, రెండేళ్లుగా ప్రభుత్వ ఆదాయం పతనమవుతోందన్నారు. కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అని ప్రజలకు అర్థమవుతోందన్నారు.