AP: గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సీఎం పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను ఆసుపత్రి నిర్వాహకులు చంద్రబాబుకు వివరించారు. అలాగే కృత్రిమ మేథ సాయంతో పని చేసే వైద్య ఉపకరణాల గురించి కూడా తెలిపారు.