WGL: సంగెం మండలం తిమ్మాపురం గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని ఇళ్లను ప్రారంభించారు. లబ్ధిదారులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.